వైయస్ జగన్ అరెస్టుపై పార్టీ నేతల భిన్న వాదనలు

వైయస్ జగన్ అరెస్టు కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావు ఖమ్మలో జిల్లా నేతలతో మూడు రోజుల క్రితం అన్నారు. జగన్ ను సిబిఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తుందని చెప్పారు. జగన్ ను అరెస్ట్ చేసినప్పటికీ కార్యకర్తలు భయాందోళనలకు గురికావలసిన అవసరంలేదని, అయితే వారు ఏ త్యాగాలకైనా సిద్దంగా ఉండాలని కోరారు. దీంతో జగన్ ను త్వరలో అరెస్ట్ చేయడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేతలే భావిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
గట్టు రామచందర్ రావు మాట్లాడిన మర్నాడు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి హైదరాబాదులో అందుకు భిన్నమైన వాదన వినిపించారు. జగన్‌ను సిబిఐ అసలు అరెస్ట్ చేయదని అన్నారు. జగన్ ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషులను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తుందని ఆయన ప్రశ్నిస్తూనే జగన్‌ను అరెస్ట్ చేస్తే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అంబటి రాంబాబు ప్రకటన ఒక విధంగా గట్టు రామచందర్ రావు మాటలను బలపరుస్తున్నట్లుగానే ఉంది.












Click it and Unblock the Notifications