వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ కాంగ్రెస్,బిజెపి హోరాహోరీ, ఉత్తరాఖండ్‌లో చేయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Panjab Map
న్యూఢిల్లీ: కడపటి సమాచారం అందే సమయానికి పంజాబ్‌లో బిజెపి, అకాలీదళ్ కూటమి 22, కాంగ్రెసు, 19 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో బిజెపి 12, కాంగ్రెసు 24, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మణిపూర్‌లో కాంగ్రెసు తొమ్మిది, ఇతరులు నాలుగు, గోవాలో ఇప్పటి వరకు ఇతరులు మాత్రమే ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు, బిజెపిలు హోరా హోరీగా ఉండగా, మణిపూర్‌లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది.

ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలను చూస్తుంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాయాజాలం పని చేయలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఎస్పీ నేత, ములాయం తనయుడు అఖేలేష్ యాదవ్ యువతను బాగా ఆకట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇక రాష్ట్ర ప్రజలు ఈసారి మాయావతికి ఝలక్ ఇచ్చి, బిజెపికి మంచి సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
Assembly elections results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X