నారా లోకేష్ ఎంట్రీపై ఆచితూచి చంద్రబాబు వ్యాఖ్య

నిజానికి, ఇది వరకే నారా లోకేష్‌కు రాజకీయ ప్రవేశానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టి తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి బావుటా ఎగురేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశానికి నందమూరి కుటుంబ సభ్యుల నుంచి ఏ విధమైన వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా ఆయన పావులు కదిపేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
తనకు వియ్యంకుడైన బాలకృష్ణను హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు అడ్డం పెట్టి నారా లోకేష్‌కు లైన్ క్లియర్ చేయాలనేది చంద్రబాబు యోచనగా చెబుతున్నారు. బాలకృష్ణ పిల్లనిచ్చిన మామ కావడంతో లోకేష్ ఎంట్రీకి ఆటంకం కలిగించరని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, నారా లోకేష్ రాజకీయ ప్రవేశంపై మాత్రం పార్టీలో కూడా తీవ్రంగానే ఆలోచన సాగుతూనే ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications