రాహుల్, సోనియాలపై జగన్ వ్యాఖ్యలు నిజమేనా?

ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం రావడానికి సోనియా గాంధీయే కారణమని జగన్‌కు కౌంటర్ వేశారు. సోనియా వల్లనే వైయస్ ఎదిగారని ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో సోనియా గాంధీ కారణంగానే కాంగ్రెసు గెలిచి ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని జగన్, ఆయన వర్గం సవాల్ విసిరింది. అయితే గతంలో జరిగిన బీహార్ ఎన్నికల నుండి మొదలు ఇప్పటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వరకు సోనియా కుటుంబం మాయాజాలం ఏమాత్రం పని చేయలేదు. తాజాగా సోనియా, రాహుల్ సొంత పార్లమెంటు నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిదింటిలో దారుణంగా కాంగ్రెసు ఓడిపోయింది. సోనియా కుటుంబం మానియా ఉత్తర భారతదేశంలోనే పని చేయలేదని అలాంటిది ఇక్కడ పని చేసిందని ఎలా చెబుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications