శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణ వాయిదా: అలీఖాన్‌కు కస్టడీ
National
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్/బెంగళూర్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైదరాబాదు సిబిఐ కోర్టు ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేసింది. మార్చి 30వ తేదీ లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని అదేశించింది. ఇదిలావుండగా, కర్ణాటకలోని అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ సిబిఐ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగిస్తూ బెంగళూర్‌లోని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ మైనింగ్ కేసులో అలీఖాన్‌ను సిబిఐ విచారించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం అలీఖాన్‌ను మరిన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది. దీంతో మరో నాలుగు రోజులు సిబిఐ కస్టడీకి అలీఖాన్‌ను అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అలీఖాన్ పలు కీలకమైన అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డి ఆస్తుల గుట్టు విప్పుతున్నట్లు తెలుస్తోంది.