వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే జగన్ రెండో విడత ఉప ఎన్నికల ప్రచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: రెండో విడత జరిగే ఉప ఎన్నికల ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అప్పుడే ప్రారంభించారు. రాష్ట్రంలోని 18 స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుండగా వైయస్ జగన్ ప్రచారాన్నే ప్రారంభించారు. రైతుల కోసం, పేదల కోసం శాసనసభా సభ్యత్వాన్ని త్యాగం చేసిన సోదరి సుచరితను వచ్చే ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గుంటూరు జిల్లాలో ఆయన సోమవారం తన ఓదార్పు యాత్రను కొనసాగించారు.

జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటై పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒకవైపు, కుళ్లు, కుతంత్రాలు మరో వైపు ఉంటాయని ఆయన అన్నారు అధికార పార్టీ డబ్బు, పోలీసులను వాడుకోవడంలో దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయతలకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పదవి పోతుందనే భయం లేకుండా నిజాయితీతో రైతు కోసం సుచరిత పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. సుచరితను తమ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

English summary
YSR Congress president YS Jagan has begun his compaign for second round of bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X