హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ ప్రభుత్వం కూలుతుంది: జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్/అనంతపురం: రానున్న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు మాసాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లాలో అన్నారు. ఒక పార్లమెంటు, పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఒక్కో రాజ్యసభ సీటును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం డబ్బులు లేవంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇటీవల జరిగిన ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు, టిడిపిలు చేతులెత్తేశాయని ఆ పార్టీ నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. బాబు నిర్వేదంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందన్నారు. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీలో అల్లకల్లోలం ఖాయమని మరో నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేరుగా అన్నారు. 18 స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. ఎస్పీఎస్ కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బాబు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.

English summary
YSR Congress Party leader Gurnath Reddy said that Kiran Kumar Reddy government will fall after bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X