వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగినితో బ్లూఫిల్మ్ తీసేందుకు యత్నించిన బిపివో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka Map
బెంగళూరు: ఓ ఉద్యోగినితో నీలి చిత్రం తీసేందుకు యత్నించిన బిపిఓ సంస్థ యజమాని ఒకరిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. వీణ అనే యువతి ఓ బిపివో సంస్థలో హ్యూమన్ రీసోర్సెస్ డిపార్టుమెంట్‌లో పని చేస్తోంది. ఇటీవల సంస్థ యాజమాన్యం ఆమెను పదోన్నతిపై దుబాయికి పంపిస్తామని చెప్పింది.

అయితే అందుకు వీణ నిరాకరించింది. తనకు పెళ్లయిందని, పిల్లలు ఉన్నారని, కాబట్టి తాను విదేశాలకు వెళ్లలేనని చెప్పింది. దీంతో వారు వీణతో దుబాయ్ వెళ్లకుంటే నీతో బ్లూఫిల్మ్ తీస్తామని హెచ్చరించారట. దీంతో అవాక్కయిన వీణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆమె కర్నాటక రక్షణ వేదికను కలిసింది.

కర్నాటక రక్షణ వేదిక, మహిళా సంఘాలు కలిసి బిపివోకి చేరుకొని ముగ్గురు యజమానుల్లో ఒకరిని పట్టకొని చితకబాదారు. అతనిని బాగా కొట్టి ఆఫీసు బయటకు ఈడ్చుకొచ్చారు. మిగిలిన ఇద్దరూ తప్పించుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కల్పించుకొని అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీణ మా సంస్థలోని ఉద్యోగే కాదని ఆ యజమాని తప్పించుకోవాలని చూస్తున్నారట.

ఈ బిపివో సంస్థ యజమానులు పేరుకే ఆ సంస్థ నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. సదరు సంస్థ బిపివో కంపెనీ పేరుతో అమ్మాయిలతో బ్లూఫిలిమ్స్ తీస్తుందని తెలుస్తోంది. అమాయక అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపి వారి నీలి సిడిలను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారట.

English summary
A BPO company from Karnataka is tried to make a blue film with company employee Veena. She was complained in local police station against BPO company owners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X