కెసిఆర్‌పై మోత్కుపల్లి, జగన్‌‌కేసులో మంత్రులపై పెద్దిరెడ్డి

mothkupalli narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన ఫాంహౌస్‌లోని మొక్కలపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేదని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం మండిపడ్డారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కెసిఆర్ ఫాంహౌస్‌లో కూరగాయ మొక్కలు చూసుకుంటూ కూర్చున్నారు తప్ప బయటకు రావడం లేదన్నారు. తాను నీడపట్టున కూర్చుని తెలంగాణ జెఏసి నేత కోదండరామ్‌ను తిప్పుతున్నారని ఆరోపించారు.

ఆయనకు తెల్ల జుట్టు వచ్చినా, మెదడు ఆ స్థాయిలో పెరగలేదన్నారు. కెసిఆర్ ఏం చెబితే దానికి తల ఊపుతున్నారని కోదండరాంను విమర్శించారు. తెలంగాణ ఇవ్వాల్సిన అధికార కాంగ్రెస్‌ను వదిలి తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. మా పార్టీని తిడితే తెలంగాణ వస్తుందా? కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచితే వస్తుందా? చెప్పాలని ప్రశ్నించారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ఎదుట విచారణకు హాజరవుతున్న మంత్రులకు గుబులు పట్టుకొందని మరో నేత పెద్ది రెడ్డి విమర్శించారు. జగన్‌తో కుమ్మక్కై ఆయనతోపాటు తామూ ఈ కేసునుంచి బయటపడేందుకు వారు తెరచాటు యత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. విజయ సాయి రెడ్డి బెయిల్‌పై విడుదల కావడం ఇందులో భాగమేనన్నారు. అనేకసార్లు తిరస్కరణకు గురైనా ఇప్పుడాయనకు సునాయాసంగా బెయిల్ దొరకడం, సమయం దాటినా సగౌరవంగా జైలునుంచి పంపడం ఇందుకు నిదర్శనాలన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 55 వేల ఎకరాల కేటాయింపుల్లో అక్రమాలను కాగ్ నిర్ధారించినా ప్రభుత్వం రద్దు చేయలేదన్నారు. అలాగే వైయస్ పాలనలో 26 జీవోలు అనేక అక్రమాలకు రాచబాట పరిచినట్లు సిబిఐ నిర్ధారించినా వాటినీ రద్దు చేయలేదని పేర్కొన్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో వేల ఎకరాలు పొందిన సంస్థలు వాటిని తాకట్టు పెట్టి రూ.కోట్లలో రుణాలు పొందినా, ఆ భూముల్లో పరిశ్రమలుగానీ, ఒక్క ఉద్యోగంగానీ రాలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+