విషాదం: సరూర్‌నగర్ చెరువులో ఆరు మృతదేహాలు

వారి మృతదేహాలు సరూర్ నగర్ చెరువులో తేలాయి. శవాలు పూర్తిగా ఉబ్బిపోయి ఉన్నాయి. దీంతో మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఆరుగురిది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ హత్య కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
మృతదేహాల కాళ్లు, చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టి ఉంది. దీంతో హత్య కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. సరూర్ నగర్ చెరువులో మృతదేహాల విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు అక్కడకు భారీగా తరలి వచ్చారు. వారెవరూ స్థానికులు కాదని తెలుస్తోంది. వారిని స్థానికులుగా ఎవరూ చెప్పడం లేదని తెలుస్తోంది.
దీంతో ఇతర ప్రాంతం నుండి వచ్చిన వారు కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని లేదా వేరే ప్రాంతం నుండి ఎవరైనా తీసుకు వచ్చి చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఉదయం సైబరాబాద్ కమిషనరేట్ కంట్రోల్ రూంకి చెరువులో మృతదేహాలు ఉన్నాయని ఫోన్ వచ్చిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు స్థానికులు ఎవరూ దీనిపై స్పందించలేదని, దర్యాఫ్తు తర్వాత అవి ఎవరి మృతదేహాలో తేలుతుందని చెప్పారు. వారి వస్త్రధారణను బట్టి దిగువస్థాయి కుటుంబానికి చెందిన నేతలుగా భావిస్తున్నారు. వారు వేసుకున్న బట్టల ద్వారా ఎవరో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ప్లాస్టిక్ తాడుతో కట్టి ఉండటం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications