అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగలి కృష్ణకు ఐదేళ్లు జైలు శిక్ష, మీడియాపై ఆగ్రహం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mangali Krishna
అనంతపురం: 2001లో సూటుకేసు బాంబు కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా పేరుగాంచిన మంగళి కృష్ణకు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మంగళి కృష్ణ ఎ-5 నిందితుడిగా ఉన్నారు. కృష్ణతో పాటు ఎ-2గా ఉన్న రామచంద్రా రెడ్డి, ఎ-3గా ఉన్న రవీంద్రా రెడ్డి, ఎ-4గా ఉన్న సుధీర్ రెడ్డికి కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

కాగా తనకు జైలు శిక్ష పడిన అనంతరం మంగళి కృష్ణ మీడియాపై మండిపడినట్లుగా తెలుస్తోంది. అంతా మీవల్లనే జరిగిందంటూ మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారట. మిగతా విషయాలు మాట్లాడేందుకు ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదని అంటున్నారు. కాగా మంగళి కృష్ణకు ఐదేళ్ల జైలు శిక్ష పడటంపై తాము జిల్లా కోర్టులో అప్పీలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. 2001లో వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదయిందని చెప్పారు.

కాగా 2001లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పెనుగొండ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అప్పటి మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్రను హత్య చేసేందుకు వీరు సూటుకేసు బాంబు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ఐస్ క్రీం బండిలో ఈ బాంబు ఉంచి పేల్చేందుకు వారు వ్యూహరచన చేశారు. కానీ అది విఫలమైంది.

ఈ అంశం అప్పట్లో అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ కేసు పదకొండేళ్లు కొనసాగింది. బుధవారం కోర్టు అంతిమ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై పరిటాల రవి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళి కృష్ణతో పాటు మిగిలిన ముగ్గురికి ఐదు సెక్షన్ల క్రింద కోర్టు శిక్ష ఖరారు చేసింది. 120బి, మారణాుధాలు కలిగిన చట్టం, ఎపిపిఎస్ యాక్ట్ 3, 4, 5 సెక్షన్ల క్రింద వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

English summary
Mangali Krishna and other three accused sentenced for five years in suitcase bomb case. Anantapur court gave judgement on wednesday in this case. In 2001, Mangali Krishna and others planned to kill late Paritala Ravindra with suitcase bomb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X