టాలీవుడ్‌లో భాను కిరణ్ హల్‌చల్, 7 కోట్లు వసూలు?

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ టాలీవుడ్‌లో హల్ చల్ సృష్టించారట. నాలుగు రోజులుగా ఆయనను సిఐడి పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో వారు భాను కిరణ్‌కు టాలీవుడ్‌తో ఉన్న లింకులు, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తదితర ఎన్నో విషయాలు పోలీసులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి నుండి భాను కిరణ్ రూ.7 కోట్లు వసూలు చేసినట్లుగా ఓ టీవీ ఛానల్ పేర్కొంది.

టాలీవుడ్‌లో అనేక సెటిల్మెంట్లు చేశాడని తెలిసిందని పేర్కొంది. ఓ బడా నిర్మాత భాను కిరణ్‌ను టాలీవుడ్‌లో పెద్ద క్రిమినల్‌గా పరిచయం చేశాడట. సెటిల్మెంట్లు తదితరాలకు సదరు నిర్మాత తన కలర్ ల్యాబ్‌నే అడ్డాగా ఎంచుకున్నారట. ఆదివారం సిఐడి పోలీసులు పలువురు ఫైనాన్షియర్లు, కొందరు నిర్మాతలను పిలిపించి సెటిల్మెంట్లు తదితరాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

కాగా సిఐడి పోలీసులు విచారణలో భాను కిరణ్ చెమటలు కక్కుతున్నాడట. భాను కిరణ్ తాను అరెస్టైన సమయంలో చిరు నవ్వుతో కనిపించాడు. కానీ ఇప్పుడు పోలీసులు విచారణతో మాత్రం అతనికి ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు. అతను హైబిపితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోందని పేర్కొంది. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించారు.

కాగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. మద్దెలచెర్వు సూరి సతీమణి భానుమతి తన ఆస్తులు తాను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. భాను కిరణ్ తదితరాల వద్ద ఉన్న ఆస్తులు ఆమె భర్తకు చెందినవి కాబట్టి ఇప్పుడు ఆమెకే చెందుతాయన్నారు. సూరి సంపాదించిన మొత్తం ఆస్తుల్ని భానుమతికివ్వాలన్నారు.

భాను కిరణ్‌‍తో ఇల్లీగల్ సంబంధాలు కలిగిన నిర్మాతలను పదవుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తాను కోర్టుకు వెళతానని చెప్పారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడిన నిర్మాతలు బయటకు రావాలని, లేదంటే తాను బయటకు తీసుకు వస్తానని అన్నారు. సి.కల్యాణ్‌ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+