హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం కొండా, పుల్లా పద్మావతిలకు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Murali-Pulla Padmavathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనమండలి సభ్యుడు కొండా మురళీ మోహన్, మరో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతికి మండలి చైర్మన్ చక్రపాణి తాఖీదులు ఇచ్చారు. ఈ నెల పదకొండవ తేదిన ఉదయం పదకొండు గంటలకు తన ఎదుట హాజరు కావాలని ఆయన వారిని ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ శనివారం నోటీసులు జారీ చేశారు.

కాగా ఇదే అంశంపై ఎస్వీ మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదవ తేదిన మండలి చైర్మన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు పదిహేడు మందిపై ఇటీవల వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేలపై వేటు అనంతరం కాంగ్రెసు పార్టీ ఇప్పుడు శాసనమండలి సభ్యులపై దృష్టి సారించింది.

కాంగ్రెసు పార్టీ ద్వారా ఎమ్మెల్సీలు అయిన జగన్ పార్టీ నేతలకు వరుసగా మండలి చైర్మన్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండా, పుల్లాలకు నోటీసులు జారీ చేశారు. కాగా తాను కాంగ్రెసు పార్టీ నియమ నిబంధనలు ఎక్కడా జవదాటలేదని కొండా మురళి ఇటీవల చెప్పారు. దీంతో ఆయన చైర్మన్ ముందు ఏం వివరణ ఇస్తారో చూడాలి.

అదే సమయంలో పుల్లా పద్మావతిపై వేటు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆమె ఇచ్చే వివరణతో చైర్మన్ సంతృప్తి చెందే అవకాశముంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ పార్టీ వైపు ఉన్న ఆమె ఇటీవలే తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని, అందుకే తాను తిరిగి కాంగ్రెసులోనే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.

English summary
Legislative Council chairman Chakrapani issued notices to YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan reddy camp MLC Konda Murali Mohan and another MLC Pulla Padmavathi on Saturday. Another Jagan camp MLA SV Mohan Reddy will be appears before chairman on eight of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X