పైలట్ల సమ్మె సరికాదు: హైకోర్టు, కొనసాగుతున్న సమ్మె

అయినప్పటికీ వారు మాత్రం తమ పట్టు వీడటం లేదు. బుధవారం కూడా పైలట్ల సమ్మె కారణంగా పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. న్యూయార్క్, చికాగో, సింగపూర్ తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ నుండి సింగపూర్, న్యూయార్క్ వెళ్లే రెండు సర్వీసులు, ముంబయి నుండి న్యూయార్క్ వెళ్లే ఓ సర్వీసు రద్దయింది. మరోవైపు బుధవారం పైలట్లు, ఎయిరిండియా యాజమాన్యం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
కాగా ఎయిర్ ఇండియాకు చెందిన సుమారు వంద మంది పైలెట్లు సోమవారం అర్దరాత్రి నుండి మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు అంతర్జాతీయ సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ నుండి చికాగో, టోరంటో వెళ్లే రెండు సర్వీసులు, ముంబయి నుంచి న్యూజెర్సీ, హాంకాంగ్ వెళ్లె రెండు సర్వీసులు రద్దయ్యాయి.
ఈ సమ్మెలో మంగళవారం ఉదయం వరకు సుమారు 250 మంది పైలట్లు పాల్గొన్నారని తెలుస్తోంది. కాగా సమ్మె చేస్తున్న పైలట్లు సాయంత్రం ఆరు గంటల లోగా విధులకు హాజరు కావాలని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వారు సమ్మెకు దిగారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
పలు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైలట్లు ఎండాకాలంలో అదీ హాలీడేస్ వీకెండ్స్‌లో ఒక్కసారిగా సమ్మెకు దిగారు. బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ట్రెయినింగ్ ఇష్యూ తేలక పోవడంతో పైలట్లు సమ్మెకు దిగారు.
సోమవారం రాత్రి ఈ అంశంపై విమానయాన సంస్థతో పైలట్లు చర్చించారు. చర్చలు విఫలమైన కొద్ది సమయంలోనే వారు సమ్మె బాట పట్టారు. కాగా కేంద్ర విమానయాన మంత్రి కూడా పైలట్లను హెచ్చరించారు. సాయంత్రం లోగా విధులకు హాజరు కావాలని సూచించారు.
కాగా పైలట్ల సమ్మె అక్రమమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ఆందోళన వల్ల సరిదిద్దుకోలేని నష్టాల్లో ఎయిరిండియా కూరుకుపోతుందని పేర్కొంది. కోర్టు తీర్పు హర్షణీయమని మంత్రి అజిత్ సింగ్ అన్నారు. ఇప్పటికైనా పైలట్లు సమ్మె బాట వీడి చర్చలకు రావాలన్నారు. కాగా అంతకుముందు పైలట్ల సమ్మెపై ఎయిరిండియా కోర్టుకు వెళ్లింది. సమ్మె వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందు వల్ల దీనిని విచారించాలని కోర్టుకు వెళ్లింది. మరోవైపు బుధవారం ఎయిరిండియా మరో పదిమంది పైలట్లను డిస్మిస్ చేసింది. మంగళవారం పదిమందిని, బుధవారం మరో పదిమందిపై వేటు వేసింది.












Click it and Unblock the Notifications