కాంగ్రెసులోకి వినూత్న నిరసన నేత బంగి అనంతయ్య

ఈ సందర్భంగా ఆయన తాను బుద్దిలేక ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పని చేశానని చెప్పారు. అందుకు ఆయన లెంపలేసుకున్నారు. అంతేకాదు కాంగ్రెసును వదిలి వెళ్లి పెద్ద తప్పు చేశానని చెప్పారు. ఆయనకు పార్టీ కండువా కప్పి బొత్స కాంగ్రెసులోకి ఆహ్వానించారు.
కాగా బంగి అనంతయ్య గతంలో కాంగ్రెసు పార్టీలోనే పని చేశారు. అయితే అక్కడ అసంతృప్తి చెందిన బంగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుండి కర్నూలుకు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబును రాజ్యసభ సీటు అడిగారు. అది రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా బాబుపై అసంతృప్తితో ఉన్నారు.
పలుమార్లు చిత్ర విచిత్ర వేషాల ద్వారా చంద్రబాబుపై మండిపడ్డారు. ఓసారి రిక్షా తొక్కి, మరోసారి బిక్షమెత్తి ఇంకోసారి చీర కట్టుకొని మరోసారి రోడ్లు ఊడ్చి ఇలా చంద్రబాబుకు తన నిరసన తెలియజేశారు. చంద్రబాబును నమ్ముకున్న తనకు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని, రోడ్లు ఊడ్చే పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. సంవత్సరం క్రితం టిడిపిని అతనిని పార్టీ నుండి బహిష్కరించింది. ఇప్పుడు బంగి బాబుపై అసంతృప్తితో తన సొంతగూటికి చేరుకున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications