భోజనం చేయని జగన్, ఇంటి వద్ద జగన్ ఫ్యామిలీ ధర్నా

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆదివారం రాత్రి ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులను పోలీసులు ఇంటికి తరలించారు. దిల్‌కుషా అతిథి గృహం ముందు జగన్ తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు వారు అక్కడ కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీసులు పక్కా పథకం ప్రకారం వారిని అక్కడి నుంచి తరలించారు. వైయస్ జగన్ భోజనం చేయలేదని తెలుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి జరిగిన పరిణామాల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. లోటస్‌పాండ్‌లోని ఇంటి వద్ద విజయమ్మతో సహా కుటుంబ సభ్యులు బైఠాయింపు జరిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జగన్ భార్య భారతి చెప్పారు. జగన్ ఆరెస్టుపై విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ లేఖ రాశారు. తాము ఆందోళనలు కొనసాగిస్తామని ఆమె ఆ లేఖలో చెప్పారు.

విజయమ్మ కుటుంబ సభ్యులను ఇంటికి తరలించడానికి ముందు సాక్షి మీడియా సిఇవో సజ్జల రామకృష్ణా రెడ్డి, జగన్ మామ గంగిరెడ్డి, మరో బంధువు వైవి సుబ్బా రెడ్డిలను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర రావు, బాజిరెడ్డి గోవర్ధన్‌లను అక్కడి నుంచి తరలించారు. మొదట వైయస్ జగన్ భార్య భారతిని, ఆ తర్వాత వైయస్ విజయమ్మ, షర్మిళను అక్కడి నుంచి తరలించారు. తన కుమారుడిని తీసుకునే తాను ఇక్కడి నుంచి కదులుతానని వైయస్ విజయమ్మ అంతకు ముందు అన్నారు. పోలీసుల తీరుపై విజయమ్మ, షర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక వాహనాల్లో వారందరినీ ఇంటికి తరలించారు.

మహిళా కమెండోలు కూడా పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనాలను రప్పించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైయస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ధర్నా విరమించుకోవాలని పోలీసులు వైయస్ విజయమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. విజయమ్మతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భార్య భారతి, సోదరి షర్మిళ రాజభవన్ సమీపంలోని దిల్‌కుషా అతిథి గృహం వద్ద ప్లాట్‌ఫారంపై బైఠాయించారు.

దిల్‌కుషా అతిథి గృహం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైయస్ విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని ఇంటి వద్ద కూడా నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. వారితో పాటు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయి రెడ్డి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+