బైపోల్స్ ప్రచారానికి 'అధినాయకుడు' వస్తోంది: బాలకృష్ణ

అధినాయకుడు సినిమానే ఎన్నికల ప్రచారాస్త్రం అన్నారు. తప్పు చేసిన వాడి బెండ్ తియ్యడమే మన పని అని అధినాయకుడులో అదే కనిపిస్తుందన్నారు. ప్రజల్లో ఒక తిరుగుబాటుని, చైతన్యాన్ని తీసుకు వచ్చే మంచి చిత్రం ఇది అవుతుందన్నారు. కాగా సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై స్పందించిన విషయం తెలిసిందే. జగన్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళుతున్నాడని అన్నారు.
జగన్ స్వయంకృపరాధం వల్లనే ఇలా జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అన్నారు. తాను సినిమాలలో బిజీగా ఉన్నందు వల్లే ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులం అందరం కష్టపడతామని, అందరం కలిసే ఉన్నామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా కలిసి వచ్చిన వారందరినీ ఆహ్వానిస్తామన్నారు.
తన అధినాయకుడు చిత్రంలో సెటైర్లు వాస్తవమే అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులను అనుసరించి తన చిత్రంలో సెటైర్లు ఉన్నాయన్నారు. బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్ ఎంతో చేశారన్నారు. ఈ రోజు ఎంతో పర్వదినం అన్నారు. తాను అధినాయకుడులో ఏ పార్టీని ఉద్దేశించి సెటైర్లు వేయలేదని, కేవలం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశించే ఉన్నాయన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబుతో కలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications