ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ఎమ్మెల్యే రెండో పెళ్లి, వివాదాస్పదం

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ మహిళా ఎమ్మెల్యే చట్టాన్నే ఉల్లంఘించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్తకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. అసోం బరాక్ వ్యాలీలోని బోర్ఖోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ రుమి నాథ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ పెళ్లి వ్యవహారంపై బరాక్ వ్యాలీ లాయర్ల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఉల్లంఘించి రెండో పెళ్లి చేసుకున్న మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. అయితే ఇంత వివాదం రాజుకుంటున్నా మహిళా ఎమ్మెల్యే మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని.. తాను భయాపడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.
జకీర్ తన భర్త అని, తనకు రాకేష్ సింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని, త్వరలో విడాకులకు దరఖాస్తు చేస్తానని రుమీ నాథ్ చెప్పారు. తాను ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లతో రెండో పెళ్లి చేసుకోలేదని చెప్పారు. తాను తన రెండో పెళ్లికి ముందే ఇస్లాం మతాన్ని స్వీకరించానని చెప్పారు. ఆమె జాకీ జకీర్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు.
ఇతను గత కొంతకాలంగా ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండో పెళ్లి ఫోటో గ్రాఫ్స్ టివి ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. కాగా రుమీ నాథ్ మొదటి భర్త రాకేష్ సింగ్ తన భార్య అపహరణకు గురైనట్లుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. 2009లో హర్యానా ఉప ముఖ్యమంత్రి చందర్ మోహన్ తన కార్యాలయంలో అసభ్యంగా ప్రవర్తించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తన పేరును చంద్ మహ్మద్‌గా మార్చుకొని.. అనురాధ బాలి అలియాస్ ఫిజా అనే మాజీ న్యాయవాదిని వివాహం చేసుకున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications