వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌కా, సంగ్మాకా: ఎన్డీయేలో కుదరని ఏకాభిప్రాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee - Sangma
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీయేలో ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వారు తీవ్రంగా చర్చించారు. అయితే అంతిమంగా ఓ నిర్ణయానికి మాత్రం రాలేక పోయారు. మరోసారి భేటీ అయి అభ్యర్థి విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీతో పాటు మాజీ స్పీకర్ సంగ్మా అభ్యర్థిత్వాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఎన్డీయేలోని కొన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని పార్టీలు పిఎ సంగ్మా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. బిజెపి సంగ్మాకు మద్దతివ్వాలనుకున్నప్పటికీ శివసేన వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో బిజెపి సంగ్మాకు మద్దతుపై వెనక్కి తగ్గింది. మిత్రపక్షాలతో చర్చించి సంగ్మాకు మద్దతివ్వడమా లేక ప్రణబ్‌ను బలపర్చడమా అలా కాకుండా కొత్త అభ్యర్థిని ప్రకటించడమా చేస్తారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తదితరులు పిఏ సంగ్మాకు మద్దతు పలుకుతున్నారు. ప్రణబ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వవద్దని.. అభ్యర్థిని పోటీకి దించాలని ఎక్కువ పార్టీలు పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. కాగా ఎన్డీయే ప్రణబ్‌కు మద్దతిస్తే తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యుడు రాంజెఠ్మలానీ చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Strong reservations from key ally JD (U) over pitting a candidate against UPA nominee Pranab Mukherjee today forced the NDA to defer its decision on the presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X