లేడీ టీచర్‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు: అరెస్టు

అల్విన్ కాలనీలోని రాజధాని హైస్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్ (43)ను కస్టడీలోకి తీసుకున్నట్లు కూకట్‌పల్లి డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఎం మల్లారెడ్డి్ చెప్పారు. మహిళా టీచర్‌పై లైంగిక వేధింపుల కింద ప్రిన్సిపాల్‌పై అభియోగాలు మోపినట్లు ఆయన తెలిపారు.
ప్రిన్సిపాల్ కస్టడీ నుంచి తప్పించుకున్న ఉపాధ్యాయురాలు విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
విద్యార్థులకు బుద్ధులు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రిన్సిపాల్ వ్యవహారంపై స్థానికులు భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications