రేవ్ పార్టీలో పట్టుబడిన యాక్టర్లు, క్రికెటర్లు

పోలీసులు తమ దాడిలో 92 మందిని పట్టుకున్నారు. పోలీసులకు చిక్కినవారిలో పూణే వారియర్స్ తరఫున ఐపియల్‌లో ఆడిన క్రికెటర్లు పార్నెల్, రాహుల్ శర్మ కూడా ఉన్నారు. శిల్పతో పాటు ఇద్దరు క్రికెటర్ల రక్త నమూనాల పరీక్షలకు సంబంధించి నివేదిక అందాల్సి ఉందని పోలీసులు చెప్పారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 92మందిలో 44 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది.
తమపై వచ్చిన ఆరోపణలను అపూర్వ, ఆయన భార్య శిల్ప ఖండించారు. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వారు చెప్పారు. ఓక్‌వుడ్ హోటల్ సెలబ్రిటీల రేవ్ పార్టీలకు కేంద్రంగా మారిందని అంటున్నారు. దాడుల సందర్భంగా పోలీసులు పది గ్రాముల కొకైన్‌ను, 64 గ్రామల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
92 మందిలో 46 మంది సాంపిల్స్ సేకరించామని, వాటికి పరీక్షలు నిర్వహించామని, 46 మందిలో 44 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసు కమిషనర్ అరూప్ పట్నాయక్ చెప్పారు.












Click it and Unblock the Notifications