చీరకట్టి...: బాలీవుడ్ లేడీ విలన్లతో నరేంద్ర మోడీ పోస్టర్లు

బిజెపి రాష్ట్ర శాఖలో నేతల కీచులాట నేపథ్యంలో తాజాగా కొన్ని వ్యంగ్య పోస్టర్లు రాజ్‌కోట్‌లో దర్శనమిచ్చాయి. బాలీవుడ్‌లో మహిళా విలన్లు, గయ్యాళి పాత్ర పోషణలో ప్రసిద్ధులైన శశికళ, లలితా పవార్ బొమ్మలతోపాటు మోడీ చీర కట్టినట్లు చిత్రించిన బొమ్మలు వాటిపై ఉన్నాయి. శశికళ, లలితా పవార్‌లకన్నా మోడీ ప్రమాదకరమని ఆ పోస్టర్‌లలో పేర్కొన్నారు.
కేశూభాయ్ పటేల్, శంకర్‌సిన్హ్ వాఘేలా మధ్య గొడవలు పెట్టాడని, సమాజాన్ని రెండుగా చీల్చాడని, మరి ఆయనది క్రూర మనస్తత్వంగల అత్తగారి పాత్రే కదా అని అందులో రాశారు. రాజ్‌కోట్‌లోని రేస్‌కోర్స్ రింగ్ రోడ్, టాగూర్ రోడ్‌లతోపాటు మేయర్ నివాసం వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇంతకుముందు మోడీ వ్యతిరేక పోస్టర్లు గుజరాత్‌లోనే కాకుండా ఢిల్లీలోనూ కనిపించడం తెలిసిందే.












Click it and Unblock the Notifications