కిరణ్, బొత్సలదే బాధ్యతన్న కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్

రాష్ట్రంలో పునర్జీవానికి కాయకల్ప చికిత్స అవసరమని చెప్పారు. ఉప ఎన్నికలలో ఓటమికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సమర్థించలేమని కిషోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చిన్న పిల్లలు, మహిళలను కూడా ఎన్‌కౌంటర్ పేరిట చంపడం అన్యాయమన్నారు.
దీనిపై పూర్తి స్థాయి దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను సమర్థించే ప్రసక్తే లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ తరహా సంఘటనలు ఎక్కడ జరిగినా అది సమాజానికి మంచిది కాదని అన్నారు. గిరిజనులను పోలీసులు, మావోయిస్టులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నైట్ విజన్ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని ప్రశ్నించారు. చీకట్లో గుడ్డిగా కాల్పులు జరిపి మైనర్లను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారన్నారు.
కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. జగన్ పార్టీ 15 స్థానాలలో విజయకేతనం ఎగురవేయగా కాంగ్రెసు కేవలం రెండు స్థానాలలో గెలిచి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పరకాలను తెరాస కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications