ఉప రాష్ట్రపతి పదవికి కిశోర్ చంద్రదేవ్ పేరు?

ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ప్రస్తుత ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్.సి.జమీర్‌ల పేర్లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ప్రణబ్ ముఖర్జి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి కోర్‌కమిటీ భేటీ ఇదే కావడం విశేషం. అలాగే, ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం కావడం ఇదే ప్రథమం.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జులై 19వ తేదీన జరగనుంది. ప్రణబ్ ముఖర్జీ విజయం దాదాపుగా ఖరారైనట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు నాయకత్వం ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడినట్లు చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం బిజెపి రాష్ట్రపతి ఎన్నికల్లో సంగ్మాకు మద్దతు ఇస్తోంది. దీంతో ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని పరిశీలించాల్సిన అవసరం కాంగ్రెసుకు లేకుండా పోయింది.
మరో వైపు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కొలికి పెట్టడం కూడా ఉప రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు తన అభ్యర్థినే ఖరారు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications