యడ్యూరప్ప లీడర్, చెప్పింది నేను వినాల్సిందే: గౌడ

తమ బిజెపి అధిష్టానం నిర్ణయం తనకు శిరోధార్యమని ఆయన అన్నారు. కర్ణాటక సంక్షోభానికి తెర దించడానికి బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నివాసంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. కర్ణాటక సంక్షోభానికి తెర దించడానికి అవసరమైన ఫార్ములాను బిజెపి నాయకత్వం ఇప్పటికే రూపొందించినట్లు, అగ్రనేత ఎల్‌కె అద్వానీ వల్లనే నాయకత్వ మార్పులో జాప్యం జరుగుతోందని అంటున్నారు.
యడ్యూరప్ప సూచించిన జగదీష్ షెట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు బిజెపి అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9 లేదా 11వ తేదీన జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అంటున్నారు. జగదీశ్ షెట్టర్‌ను ముఖ్యమంత్రిగా నియమించి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా సృష్టించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఉప ముఖ్యమంత్రి పదవికి మంత్రి ఆర్ అశోక్, కర్ణాటక బిజెపి అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప పేర్లు వినిపిస్తున్నాయి. నితిన్ గడ్కరీ నివాసంలో సమావేశమైన బిజెపి కోర్ కమిటీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications