నెగ్గిన యడ్యూరప్ప: జగదీశ్ షెట్టర్ ఇన్, గౌడ అవుట్

ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడ శనివారం సాయంత్రం గానీ, రేపు గానీ రాజీనామా చేయవచ్చునని తెలుస్తోంది. ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ఆలోచన సాగుతోంది. తాను దిగిపోవడం ఖాయమని తెలిసిన సదానంద గౌడ్ తీవ్ర నైరాశ్యంతో మాట్లాడారు. కర్ణాటకను దేవుడే కాపాడాలని ఆయన అన్నారు. బిజెపి అధిష్టానం నిర్ణయం తనకు శిరోధార్యమని ఆయన అన్నారు. తాను పార్టీ కార్యకర్తనైతే, యడ్యూరప్ప పార్టీ లీడర్ అని వ్యాఖ్యానించారు. లీడర్ చెప్పిందే వేదం, అదే తాను పాటిస్తానని సమాచారం.
ఈ నెల 9 లేదా 11వ తేదీన జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని తెలియవచ్చింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా సృష్టించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి మంత్రి ఆర్ అశోక్, కర్ణాటక బిజెపి అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప పేర్లు వినిపిస్తున్నాయి. నితిన్ గడ్కరీ నివాసంలో సమావేశమైన బిజెపి కోర్ కమిటీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం సదానందగౌడ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వస్తారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, అద్వానీలతో సదానంద భేటీ కానున్నట్లు సమాచారం. అధిష్టానం పిలుపు మేరకు సదానంద గౌడ ఢిల్లీ బయలుదేరారు. ఆయన నితిన్ గడ్కరీ, ఎల్‌కె అద్వానీ, ఇతర నాయకులను కలుస్తారు. గత ఆగస్టులో యడ్యూరప్ప స్థానంలో సదానంద గౌడ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.












Click it and Unblock the Notifications