సదానంద గౌడ రాజీనామా: శెట్టార్‌తో కలిసి కారులో...

Sadananda Gowda - Jagadish Shettar
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ రాజీనామా చేశారు. బుధవారం ఉదయం ఆయన గవర్నర్ భరద్వాజను కలిసి తన రాజీనామాను సమర్పించారు. కర్నాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా, ఆయన మంగళవారం ఎన్నికైన విషయం తెలిసిందే.

జగదీష్ శెట్టార్ పేరును మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి సదానంద గౌడ బలపర్చారు. నాలుగేళ్ల కిందట కర్నాటకలో బిజెపి అధికారంలోకి రాగా, శెట్టార్ ఈ వ్యవధిలో మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సదానంద రాజీనామా సమర్పించిన అనంతరం శెట్టార్ గవర్నర్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి తేదిని ఖరారు చేయాలని కోరారు. అయితే ఇప్పటికే గురువారం ప్రమాణ స్వీకారం తేది ఖరారు అయింది. కాగా సదానంద, శెట్టార్ ఒకే కారులో వచ్చారు.

కాగా బిజెపికి యడ్యూరప్ప తలనొప్పి పోయి రాజీనామాకు సై అన్న ముఖ్యమంత్రి సదానంద గౌడ సమస్య ఇటీవల ప్రారంభమైనప్పటికీ దానిని అధిష్టానం క్లియర్ చేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామాకు సిద్ధమన్న సదానంద గౌడ తాను రాజీనామా చేయాలంటే... అని పార్టీ ముందు కొన్ని షరతులు పెట్టారు. తన షరతులకు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని లేదంటే ససేమీరా అంటున్నారు.

తన షరతులకు అంగీకరించకుంటే బిజెపిఎల్పీ సమావేశాలకు కూడా రానని తెగేసి చెప్పారు. ఈ నెల 12వ తేదిన జగదీష్ శెట్టార్ కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ లోగా తన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఆయన అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టారు. శెట్టార్ కెబినెట్లోని 32 మంత్రుల పేర్ల వివరాలను తనకు ముందే ఇవ్వాలని, మంత్రివర్గంలో తన వర్గానికి చెందిన వారిని 15 మందిని తీసుకోవాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తమకే ఇవ్వాలని షరతులు పెట్టారు. అయితే దానిని అధిష్టానం క్లియర్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+