అజిత్‌ సింగ్ నియోజకవర్గంలో పెద్దల వింత నిర్ణయాలు

Bagpat district
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో గ్రామ పెద్దలు విచిత్రమైన ఆంక్షలు పెట్టారు. ఈ గ్రామం కేంద్రమంత్రి అజిత్ సింగ్ నియోజకవర్గం అయిన బాగ్‌పత్‌లో ఉంది. ఈ గ్రామం ఎక్కడో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో లేదు. దేశ రాజధాని అయిన లక్నోకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ గ్రామంలోని పెద్దలు తీసుకున్న నిర్ణయాలు అక్కడ సంచలనం, చర్చనీయాంశమయ్యాయి.

మహిళలు సెల్‌ఫోన్‌లు ఉపయోగించకూడదు. ఎవరూ ప్రేమ వివాహాలు చేసుకోకూడదు. ఒకవేళ అలా వివాహం చేసుకుంటే వారు ఆ గ్రామంలో ఉండకూడదు. నలభై ఏళ్లలోపు మహిళలు మగవారి తోడు లేకుండా బయటకు రావద్దు. సాయంత్రం వేళల్లో అమ్మాయిలు బయటకు రావద్దు. మహిళలు, యువతులు ఇంటి నుండి బయటకు వస్తే కొంగు తల పైన కప్పుకొని రావాలి. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరగరాదు.

మహిళలకే కాదు మగవారికి కొన్ని నిబంధనలు పెట్టారు గ్రామ పెద్దలు. యువకులు చెవులలో హెడ్ ఫోన్లు పెట్టుకొని రోడ్ల పైన నడవకూడదు. వరకట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇచ్చినా తీసుకున్న కఠిన శిక్ష ఉంటుంది. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాలకు గ్రామ ప్రజలంతా ఆమోద ముద్ర వేయడం గమనార్హం. అయితే ఈ పంచాయతీ నిర్ణయాలు తమ దృష్టికి వచ్చాయని, విచారణ జరిపి నివేదిక పంపవలసిందిగా స్థానిక అధికారులను ఆదేశించామని బాగ్‌‍పథ్ పోలీసు సూపరిండెంట్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+