జగన్ వైఖరి తేలిపోయింది: కెటిఆర్, విజయమ్మకు ప్రశ్న

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం తెలంగాణపై ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వరంగల్ జిల్లాలో, విజయమ్మకు కరీంనగర్ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భారగా భద్రత ఇచ్చి పర్యటన చేయనిచ్చిందన్నారు. విజయమ్మ తెలంగాణ దండయాత్రకు కాంగ్రెసు ప్రభుత్వం సహకరించిందని విమర్శించారు.
చేనేత దీక్ష అంటూ వచ్చిన విజయమ్మ సిరిసిల్లలో ఏమా మాట్లాడారని ప్రశ్నించారు. అడుగుడుగునా తెలంగాణవాదులు అడ్డుకొని రాష్ట్రంపై స్పష్టమైన వైఖరి చెప్పమని అడిగితే ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేసినప్పుడు విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుందని... ఇప్పుడు తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు.
పదివేల మంది పోలీసు పహారాలో విజయమ్మ సిరిసిల్లకు వచ్చి ఏం సాధించారన్నారు. తాము విజయమ్మ రాకను వ్యతిరేకించలేదని పార్టీ వైఖరి చెప్పాక తెలంగాణలో అడుగు పెట్టమని మాత్రమే చెప్పామన్నారు. జగన్ అవినీతిని చట్ట బద్దం చేసేలా, సీమ సంస్కృతిని బట్టబయలు చేసేలా విజయమ్మ పర్యటన చేసినట్లుగా ఉందన్నారు. ఈ సందర్భంగా కెటిఆఱ్ కెటి రామారావు అనే వెబ్ సైట్ ప్రారంభించారు.
జౌళీకి, చేనేతకు కూడా తేడా తెలియని విజయమ్మ చేనేత దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు అన్నారు. జగన్ వస్తాడు, ఉద్దరిస్తాడని చెప్పడం తప్ప విజయమ్మ సిరిసిల్ల దీక్షలో ఏం చెప్పారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయలేదన్నారు. ప్రణబ్‌కు ఓటేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ పైన అనుమానాలు వచ్చాయని, దీక్షలో కిరణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం ద్వారా ఆ అనుమానాలు నిజమయ్యాయన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications