హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం మార్పు: దామోదర్ పెదవి విరుపు, తెలంగాణపై...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramireddy Damodar Reddy
రెడ్డిని మారిస్తే ప్రయోజనం ఏమీ లేదన్నారు. అయినా సిఎం మార్పు అంశం తమ పార్టీ అధిష్టానం చేతిలో ఉన్న విషయమని చెప్పారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు కమిటీ ప్రభుత్వానికి, పార్టీకి చేసిన సూచనలతో ఒరిగేదేమీ లేదన్నారు.

సొంత జిల్లాలలో కూడా పార్టీని గెలిపించలేక పోయిన వారు సూచనలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రులుగా ఐదేళ్లు పూర్తి చేసిన నేతలు ఆ పదవులకు రాజీనామా చేసి పార్టీకి సేవలందించాలని సూచించారు. స్వచ్చంధంగా వారికి వారే వైదొలగాలని సూచించారు. యువతకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలన్నారు. ఆర్థిక నేరాల కోర్టులో నేరస్తుడిగా రుజువైన మంత్రి పార్థసారథి రాజీనామా విషయమై ఆయనే తేల్చుకోవాల్సిన విషయమన్నారు.

పని చేయని వారిని పదవుల నుండి తొలగించాలన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణను పరిష్కరించాలన్నారు. తెలంగాణ పరిష్కరించుకుండా ఇంకా ఏం చేసినా లాభం లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పారిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కాంగ్రెసును పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తెలంగాణ అంశం తదితర అన్ని విషయాలపై తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు.

English summary
Former Minister Damodar Reddy said that there is no use with chief minister change in the state. He said this issue is under high command. He was blames Dharmana Prasad committee for their suggestions to party and government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X