భర్తలకోసం పోలీస్ భార్యల ఫైట్: రంగంలోకి బాస్, సఫలం

కానిస్టేబుల్స్ కుటుంబాలు పెట్టిన అన్ని డిమాండ్లకు డిజిపి ఓకే చెప్పారు. డిజిపి హామీతో వారు తమ ఆందోళనను విరమించారు. పోలీసు కుటుంబాల న్యాయమైన డిమాండ్లన్నింటినీ తాము తీరుస్తామని చెప్పారు. త్వరలో వీటిపై ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఆందోళనలో పాల్గొన్న ఎవరి పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదన్నారు. ఇక నుండి ప్రతి నెల పోలీసుల కుటుంబ సభ్యులతో భేటీ నిర్వహిస్తామని చెప్పారు.
దూర ప్రాంతాలలో పని చేస్తున్న వారిని వెనక్కి పంపిస్తామన్నరు. మరోసారి దూర ప్రాంతాలకు పంపకుండా, ఎక్కువ రోజులు అక్కడే ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానిస్టేబుళ్లపై వేధింపులు లేకుండా చూస్తామని, ఆర్డర్లీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఎబిసి గ్రూపులు రద్దు చేస్తామని, సెలవులు అవసరమైనప్పుడు ఇస్తామని చెప్పారు. కానిస్టేబుళ్లకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
డిజిపి హామీలన్నింటికీ ఒప్పుకోవడంపై పోలీసు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కాగా కొండాపూర్ బెటాలియన్ ఆర్ఐ వినోద్ పైన శాఖ వేటు వేసింది. పోలీసు కుటుంబాలు బాస్ ముందు పెట్టిన డిమాండ్లు... ఆర్డర్లీ విధానం రద్దు, ఎబిసి గ్రూప్ విధానం రద్దు, తమిళనాడు తరహా రూల్స్‌కు అమలు, నెలకు మూడు రోజుల సెలవులు, 8 ఏళ్లు దాటిన వారికి ఉన్నతోద్యోగాలలో ప్రాధాన్యత, 100 కిలోమీటర్ల లోపు డ్యూటీ వేయడం. వీటన్నింటికి పోలీస్ బాస్ దినేష్ రెడ్డి సరే అనడంతో వారు తమ ఆందోళన విరమించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications