వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌హోస్టెస్ సూసైడ్:కందా అరెస్టు అవకాశం, సోదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetika Sharma-Gopal Goyal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక ఆత్మహత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి గోపాల్ కందాను అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. కందా ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, అతని ఆచూకీ దొరకగానే అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టు ప్రచారం నేపథ్యంలో గోపాల్ కందా తన న్యాయవాదిచే గురువారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఏ క్షణమైనా అతను అరెస్టయ్యే అవకాశముంది. గీతిక అత్యంత సున్నిత మనస్కురాలని, ఆమెకు తన పట్ల ఆప్యాయత, కోపం రెండూ ఉండేవని కందా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కందా ఈ బెయిల్ పిటిషన్‌ను తన న్యాయవాదిచే కోర్టులో వేయించారు. మరోవైపు పోలీసులు గూర్గాన్‌లోని కందా ఫామ్ హౌస్‌లో, సిర్సాలోని అతని ఇంట్లో, అతని కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.

కాగా గీతిక శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉన్న గోపాల్ కందా తప్పించుకొని తిరుగుతున్నట్లుగా పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు. అయితే కందా మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారట. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. అరుణ చద్దాను తాము అరెస్టు చేశామని, కందా మాత్రం పారిపోయారని చెప్పారు.

తాము కందా కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే కందా అదృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అరుణ చద్దాను పలుమార్లు విచారించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ ఎదుట హాజరవ్వాలని కందాకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి మూడు రోజులు అయినా కందా నుండి ఎలాంటి స్పందన లేదు. అతను విచారణకు హాజరు కావడం లేదు. ఆదివారం గీతిక శర్మ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన సూసైడ్‌ నోట్‌లో కందా పేరు పేర్కొంది.

English summary
A Delhi court on Thursday rejected the anticipatory bail plea of former Haryana minister Gopal Goyal Kanda. Kanda was named in the suicide note of a young former MDLR flight attendant, Geetika Sharma, who was found dead on August 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X