30 ఏళ్ల లోపు యువతులు గల్ఫ్‌కు నో: వేధింపులవల్లే

గల్ఫ్‌కు వలస వెళ్లే యువతులకు వయోపరిమితిని విధించినట్టు ఆయన తెలిపారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దాదాపు 25 ఏళ్ల వయసులోని 2.44 లక్షల మంది నేపాలీ యువతులు గల్ఫ్‌లో.. వివిధ పనుల్లో కుదురుకొన్నారు. శ్రీలంక, ఫిలిప్పైన్స్, నేపాల్ తదితర ఆసియా దేశాల యువతులను గల్ఫ్‌లో ఆయా యజమానులు వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, 30ఏళ్లలోపు యువతులు గల్ఫ్‌లో పని చేయరాదని నిషేధం విధించింది మాత్రం ఒక్క నేపాల్ రాజ్యమే. 2010లో లెబనాన్‌లో 15మంది నేపాల్ యువతులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల్లో.. ఇళ్లల్లో పని చేసే వాళ్లు, ఇతరులు.. తమ యజమానుల హింసను తట్టుకోలేక పోతున్నారు. దీంతో వారు నేపాల్ రాయాబార కార్యాలయాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications