ఎయిర్ హోస్టెస్ సూసైడ్‌లో కొత్త ట్విస్ట్: గీతికకు అబార్షన్

Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గీతిక ఆత్మహత్య జరిగిన ఎనిమిది రోజుల తర్వాత షాకింగ్ ఇచ్చే కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అరుణ చద్దా.. గీతికకు గర్భస్రావం జరిగిందని చెప్పాడని తెలుస్తోంది. అరుణ చద్దాను పోలీసులు ఆదివారం ఢిల్లీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

ఇప్పటికే చద్దాని రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. ఆమె రిమాండ్ పూర్తి కావడంతో పోలీసులు మరిన్ని రోజులు అరుణను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరనున్నారని తెలుస్తోంది. కోర్టు తిరిగి రిమాండుకు అనుమతిస్తే గీతిక శర్మను అబార్షన్ కోసం ఎక్కడకు తీసుకు వెళ్లారో పోలీసులు తెలుసుకోనున్నారు. ఎనిమిది రోజుల తర్వాత గీతికకు అబార్షన్ అయిందన్న కొత్త ట్విస్ట్ బయటకు రావడం గమనార్హమని చెప్పారు.

కాగా మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక ఆత్మహత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి గోపాల్ కందాను అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. కందా ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, అతని ఆచూకీ దొరకగానే అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టు ప్రచారం నేపథ్యంలో గోపాల్ కందా తన న్యాయవాదిచే గురువారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఏ క్షణమైనా అతను అరెస్టయ్యే అవకాశముంది. గీతిక అత్యంత సున్నిత మనస్కురాలని, ఆమెకు తన పట్ల ఆప్యాయత, కోపం రెండూ ఉండేవని కందా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కందా ఈ బెయిల్ పిటిషన్‌ను తన న్యాయవాదిచే కోర్టులో వేయించారు. మరోవైపు పోలీసులు గూర్గాన్‌లోని కందా ఫామ్ హౌస్‌లో, సిర్సాలోని అతని ఇంట్లో, అతని కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.

కాగా గీతిక శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉన్న గోపాల్ కందా తప్పించుకొని తిరుగుతున్నట్లుగా పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఎండిఎల్ఆర్ మేనేజర్ అరుణా చద్దాను అరెస్టు చేశారు. అయితే కందా మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారట. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. అరుణ చద్దాను తాము అరెస్టు చేశామని, కందా మాత్రం పారిపోయారని చెప్పారు.

తాము కందా కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే కందా అదృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అరుణ చద్దాను పలుమార్లు విచారించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమ ఎదుట హాజరవ్వాలని కందాకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి మూడు రోజులు అయినా కందా నుండి ఎలాంటి స్పందన లేదు. అతను విచారణకు హాజరు కావడం లేదు. ఆదివారం గీతిక శర్మ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన సూసైడ్‌ నోట్‌లో కందా పేరు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+