ధర్మానకు కృష్ణదాస్ మద్దతు: జగన్ పార్టీలోకి వస్తే ఓకే

ఆయన మంగళవారం సాయంత్రం విశాఖపట్నం వచ్చినపుడు విలేకరులతో మాట్లాడారు. వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుల్లో మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేయాల్సిన పరిస్థితులపై స్పందించాల్సిందిగా కృష్ణదాసును కోరగా, ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. భూ కేటాయింపులపై నిర్ణయాలన్నీ మంత్రివర్గం సమష్టిగా తీసుకున్నవన్నారు. దానికి ప్రసాద రావు వ్యక్తిగతంగా బాధ్యుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.
తన తమ్ముడు తెలిసి ఏ తప్పు చేయడని, ఎవరినో ఆశ్రయించి ఏదో మేలు పొందాలనుకునుకోవడం అతడి నైజం కాదని స్పష్టం చేశారు. ఇందులో అతడి భాగస్వామ్యం ఉందని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తను ఒకరితో చెప్పించుకునే మనిషి కాడని, రాజీనామా చేయాలని తాను అనుకుంటే వెనకడుగు వేయడన్నారు. తన సోదరుడు ధర్మాన.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తానంటే వ్యతిరేకించనని, సాదరంగా ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications