నరేంద్ర మోడీకి నో చెప్పిన బాబు, ఉర్దూ నేర్చుకుంటా

నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి సుభిక్షం కాదని, సెక్యులర్ భావాలు గల వ్యక్తికే మద్దతు ఇస్తామని బాబు చెప్పారు. ముస్లింల అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం పార్టీ పరంగా కమిటీ వేశామన్నారు. అందులో చర్చించి త్వరలో ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. కాగా త్వరలోనే తాను ఉర్దూ నేర్చుకుంటానని చంద్రబాబు తెలిపారు.
కాగా 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఫోకస్ అవుతున్న దృష్ట్యా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే బిజెపికి మద్దతివ్వనని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అభ్యర్థి విషయంలో మాట్లాడటం రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఇఫ్తార్ విందులో చంద్రబాబు ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి నరేంద్ర మోడీ నామం జపించి ఉంటారని అంటున్నారు.
కాగా బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ కూడా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. జెడి(యు) ఎన్డీయే భాగస్వామ్య పక్షం. అయితే 2014 ఎన్నికలలో మోడీ ప్రధాని అభ్యర్థి అయితే తాము ఎన్డీయేకి చేయిచ్చి కాంగ్రెసుతో కలవడానికి కూడా సిద్దమని సంకేతాలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications