రాజీవ్ పుణ్యమే: కిరణ్, పాలన ఉందా అని... పల్లంరాజు

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. రాజీవ్‌కు టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టమని, భారత్ సాంకేతికంగా ముందుకు వెళితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడగలమని ఆయన భావించే వారని అన్నారు. అందుకే టెక్నాలజీ వృద్ధిని, కంప్యూటర్ల వాడకాన్ని ఆయన ఎంతో ప్రోత్సహించే వారన్నారు. సామాన్యుడికి కూడా ఈ రోజు సెల్ ఫోన్, ఇంటర్నెట్, టివిలు అందుబాటులో ఉన్నాయంటే అది రాజీవ్ పుణ్యమే అన్నారు. టెక్నాలజీని పారదర్శకంగా వాడాలని, అది ప్రజలకు ఉపయోగపడాలని భావించిన వ్యక్తి రాజీవ్ అన్నారు.
18 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించిన ఘతన ఆయనదే అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వస్తేనే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. ఐకెపి ద్వారా వారికి భారీగా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలలో మహిళలకు యాభై శాతం కేటాయిస్తామన్నారు.
పార్టీ ప్రయోజనాల కోసం అందరం కలిసి కట్టుగా పని చేస్తామని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో పిసిసి పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి అన్నారు. రాజీవ్ ఆశయాలకు తగ్గట్లుగా పాలన ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి పల్లం రాజు అన్నారు. ఇలాగే సాగితే భావితరాలు మనలను క్షమించవన్నారు.
సోనియా గాంధీకి బలం చేకూర్చి, 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశలో పని చేయాలని డి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలను దరికి చేకూర్చుకుంటేనే కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరుతుందని వి. హనుమంత రావు అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications