గీతిక ఆత్మహత్య: అసహజమైన సెక్స్ కూడా కారణం

ఆగస్టు 5వ తేదీన గీతికా శర్మ ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ కందా, ఎండిఎల్ఆర్ ఉద్యోగిని అరుణా చద్దా తన ఆత్మహత్యకు కారణమని, తనను వారు మానసిక హింసకు గురి చేయడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె సూసైడ్ నోట్‌లో ఆరోపించింది.
గీతికా శర్మ యోని ద్రావకాలను డిఎన్ఎ పరీక్షకు పంపించారు. ఈ పరీక్ష గీతికా శర్మ ఆత్మహత్యకు సంబందించిన ఇతర కారణాలను కూడా తెలియజేయవచ్చునని భావిస్తున్నారు. శవపరీక్ష నివేదికను మీడియాకు విడుదల చేశారు. గీతికా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కందా ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆయనను ఏడు రోజుల విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే, గీతికా శర్మ కేసును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హర్యానా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కందాను కాపాడడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కందాకు నేరచరిత్ర ఉందని, గతంలో కూడా ఆయన ఇటువంటి కేసుల్లో ఇరుక్కున్నారని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ నాయకుడు అజయ్ చౌతాలా రోహతక్‌లో మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications