• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాలి బెయిల్ డీల్: ఎసిబి ముందుకు రేపు శ్రీరాములు

By Pratap
|

B Sriramulu
బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో బిఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు, శాసనసభ్యుడు బి. శ్రీరాములు రేపు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ముందు హాజరు కానున్నారు. శ్రీరాములుకు ఎసిబి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాను రేపు హైదరాబాదులో రేపు ఎసిబి ముందు హాజరవుతానని, ఎసిబి అధికారుల దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, చట్టాలను తాను గౌరవిస్తానని ఆయన చెప్పారు. ఈ సంఘటన తన పార్టీ భవిష్యత్తును దెబ్బ తీస్తుందనే వార్తలను ఆయన ఖండించారు. శ్రీరాములు తనను పిలిచి ఏప్రిల్ 21వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ గురించి మాట్లాడారని, హైదరాబాదులోని రావి సూర్యప్రకాష్ రావుకు న్యాయమూర్తులు చాలా మంది తెలుసునని, అతన్ని కలిసి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చేలా చూడాలని చెప్పారని కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబు చెప్పారు.

సురేష్ బాబునే కాకుండా ఎసిబి అధికారులు గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారి శానససభ్యుడు గాలి సోమశేఖర రెడ్డిని కూడా అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఎసిబి 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో 8 మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.

ఈ కేసులో శ్రీరాములును కూడా ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ లభించేలా ముడుపుల కథను శ్రీరాములు నడిపించారని ఎసిబి అనుమానిస్తోంది. శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Founder of BSR Congress, B Sreeramulu, who was served notice by the Anti-Corruption Bureau police from Andhra Pradesh, on Monday said he would appear before it on Tuesday. "I would appear before ACB in Hyderabad tomorrow and cooperate with the authorities investigating the case (cash-for-bail scandal)," he told reporters here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more