వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తి పద్మారావు ఫైర్: తిట్టిస్తారా అని వివేక్‌కు బొత్స క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Vivek
న్యూఢిల్లీ: పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వివేక్ పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు రాజీనామా వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు బొత్స సత్తిబాబు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణపై అధిష్టానాన్ని ఒప్పించే దిశలో ప్రయత్నాలు చేయాలని కోరుతూ బొత్సను కలిశారు. ఈ సందర్భంగా బొత్స వివేక్ పైన మండిపడ్డారు.

కత్తి పద్మారావుతో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలను తిట్టిన పద్మారావుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరతారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితల హత్యాకాండపై ఆధివారం ఎంపి వివేక్ నివాసంలో కత్తి పద్మారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అతను బొత్సపై మండిపడ్డారు.

లక్ష్మీపేట ఘటనలో బొత్స పాత్ర ఉందంటూ తీవ్రంగా ఆరోపించారు. దీంతో వివేక్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు. నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీ నేతపై మండిపడటమేమిటని కత్తిని ప్రశ్నించారు. ఇంట్లో ప్రెస్ మీట్‌ను పెట్టవద్దని కావాలంటే వేరే చోట పెట్టుకోవాలని సూచించారు. వివేక్ ఇంటి నుండి కత్తి పద్మారావు తనపై విరుచుకు పడటంతో బొత్స ఎంపీపై మండిపడ్డారు.

అయితే కత్తి ప్రెస్ మీట్‌తో తనకు సంబంధం లేదని, పార్టీ నేతను తిడతాడని తాను అనుకోలేదని పార్టీ నేతపై ఆరోపణలు చేస్తున్నారని తెలిసి తాను అతనిని వెంటనే వెళ్లిపోవాలని సూచించానని, తనపై బొత్స కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారని భావించలేదని అన్నారు. కాగా తెలంగాణ కోసం బొత్సను కలిసిన వారిలో వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ తదితరులు కలిశారు.

English summary
PCC chief Botsa Satyanarayana fired at Peddapalli MP Vivek for Katti Padmarao's press meet from his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X