నేను సిఎం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు: చిరు

Chiranjeevi
న్యూఢిల్లీ: తాను ముఖ్యమంత్రి కావాలని కొంత మంది ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నారని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఈ పుట్టిన రోజుకు ప్రత్యేకత ఏమీ లేదని, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన భవిష్యత్తు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. పదవులు వారు ఇస్తారని ఆయన అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని కొంత మంది అంటున్నారంటే అది వారు తన పట్ల అభిమానాన్ని చాటుకోవడమేనని, తనను ముఖ్యమంత్రిగా చూడాలని వారు కోరుకుంటున్నారని అనుకోవాలని ఆయన అన్నారు.

2014 ఎన్నికల్లో తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని ఆయన అన్నారు. సమిష్టి కృషి ఉంటే 2014లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసు ఏమైపోతుందనే మీమాంస అక్కరలేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఒక్క రోజులో పోవని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూ పోవాలని ఆయన అన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తే కొత్త సమస్యలు వచ్చి పడతాయని, అప్పుడు వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని, సమస్యల పరిష్కారమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.

మంత్రి పదవికి ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామాను ఆమోదించాలా, వద్దా అనే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని, ఏం చేస్తారనేది వేచి చూద్దామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఖరి సరిగానే ఉందని ఆయన చెప్పారు. ఆరోపణలు రాగానే ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేశారని, ఆ ఆరోపణలపై విచారణ జరగాల్సి ఉందని, విచారణ ముగియకముందే చర్యలు తీసుకోవాలని అనడం సరి కాదని ఆయన అన్నారు.

అభిమానులకు కాస్తా దూరమవుతున్నా ప్రజలకు దగ్గర అవుతున్నాననే సంతృప్తి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి విషయంలో మార్పులు చేర్పులు ఉండబోవని ఆయన చెప్పారు. కాంగ్రెసు మహా వృక్షం లాంటిందని, శాశ్వతంగా ఉండే పార్టి అని, పార్టీ ఉంటుందా ఉండదా అనే మీమాంస అక్కరలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+