ట్రయాంగిల్: కందాను పెళ్లాడాలని గీతిక అనుకుందా?

అంకిత, గీతికలతో కందాకు వైవాహికేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కందా భార్యకు ఈ విషయం తెలుసునని కూడా అంటున్నారు. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను కందాను వివాహం చేసుకుంటానని, అందువల్ల కందాను వదిలేయాలని గీతిక అంకితకు చెప్పినట్లు సమాచారం. గోవాలోని కందా కాసినోలో అంకిత డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ విషయంపై బాలీవుడ్ నటి నూపుర్ మెహతాను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
కందాతో అంకితకు ఓ పాప కూడా ఉందని నూపుర్ మెహతా ఇంతకు ముందు చెప్పింది. ఎండిఎల్ఆర్ మాజీ ఉద్యోగిని అయిన వర్ధమాన తార నూపుర్ గోవా కాసినోలో కూడా పనిచేసింది. గీతికకు, అంకితకు మధ్య వ్యక్తిగత వివాదం ఉందని, అంకితపై గీతిక కేసు కూడా పెట్టిందని నూపుర్ చెప్పింది. అంకిత వల్ల కందాతో తన సంబంధం కొనసాగబోదనే భావనకు గీతిక గురైనట్లు మీడియా వార్తల వల్ల తెలుస్తోంది.
గీతికను తమ కూతురులాగా చూసుకునేవాళ్లమని కందా భార్య సరస్ చెప్పిన తర్వాత కూడా అటువంటి వార్తలు మీడియాలో వచ్చాయి. గీతికకు పలుమార్లు అబార్షన్ జరిగినట్లు అరుణ చద్దా అంతకు ముందు చెప్పారు. గీతికను అసజమైన లైంగిక క్రియకు గురి చేసినట్లు శవపరీక్షలో కూడా తేలింది. కందాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి వార్తలపై వ్యాఖ్యానించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ఆగస్టు 5వ తేదీన గీతికా శర్మ ఉరేసుకుని మరణించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications