చంద్రబాబుతో కటీఫ్: వైయస్ జగన్‌తో సిపిఎం దోస్తీ?

ఇదిలావుంటే, సోదర వామపక్షం సిపిఐతో కూడా ఎన్నికల్లో సిపిఎం నడిచే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. సిపిఐ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దగ్గరైంది. శనివారం విజయవాడలో తెలుగుదేశం పార్టీతో కలిసి సిపిఐ మహా ధర్నాకు దిగింది. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ తెలుగుదేశం పార్టీతో కలిసి మహా ధర్నాకు దిగింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. సిపిఎం మాత్రం ఒంటరిగా పోటీ చేసింది.
తెలంగాణలో సిపిఐ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అటు తెలుగుదేశం పార్టీతోనూ ఇటు తెరాసతోనూ సిపిఐ సిద్ధపడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం తెరాసతో దోస్తీ కట్టే అవకాశాలు ఏ మాత్రం లేవు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా సిపిఎం పూర్తిగా దూరమైనట్లేనని భావిస్తున్నారు.
శనివారం మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విజయవాడలో చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం, సిపిఐలది అవకాశవాద రాజకీయమని ఆయన ఆ పార్టీలు చేపట్టిన మహాధర్నాపై వ్యాఖ్యానించారు. నీరు విడుదల చేయకూడదన్న పార్టీలే ఇప్పుడు నీటి విడుదల కోసం ఆందోళన చేస్తున్నాయని కూడా ఆయన విమర్శించారు. దీన్ని బట్టి సిపిఎం ఆ రెండు పార్టీలకు పూర్తిగా దూరం జరిగేందుకు మానసికంగా సిద్ధపడినట్లు చెబుతున్నారు.
ఢిల్లీ పీఠంపై యుద్ధం చేస్తున్నారని చెప్పి సిపిఎం వైయస్ జగన్‌తో కలిసి పనిచేయడానికి సిపిఎం సిద్ధపడుతుందని అంటున్నారు. పెద్ద శత్రువును ఎదుర్కోవడానికి ఆ శత్రువుపై పోరాటం చేస్తున్న చిన్న శత్రువుతో కలిసి పనిచేయడానికి సిపిఎం సిద్ధపడుతుందని అంటున్నారు. చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి పని చేసే విషయంపై సిపిఎంలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications