ట్విస్ట్: ఎయిర్ హోస్టెస్ గీతికను బెదిరించిన కందా 'భార్య'

కందాతో తనకు వివాహం జరిగిందని, తమకు ఓ పాప కూడా ఉందని అంకిత చెప్పుకుంది. అంకితపై గీతికా శర్మ 2009లో కేసు పెట్టింది. ఈ సమయంలో పోలీసులు అంకితను గోవాలోని పానాజీ పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆమె ఆ విషయాన్ని అంగీకరించినట్లు బయటపడింది.
పానాజీ పోలీసుల వద్ద ఉన్న రికార్డులను ఢిల్లీ పోలీసులు పరిశీలించారు. పానాజీలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న గీతిక ఫ్లాట్‌లోకి అంకితా సింగ్ దూసుకెళ్లి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లినట్లు ఆ రికార్డులను పరిశీలించిన ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కందాకు చెందిన గోవాలోని కాసినోలో ఉద్యోగం మానేయాలని కూడా తాను గీతికను బెదిరించినట్లు అంకిత పానాజీ పోలీసుల వద్ద అంగీకరించింది.
కందాకు అంకిత అనే పేరు గల మహిళతో అక్రమ సంబంధం ఉందని, వారికి ఓ పాప కూడా పుట్టిందని గీతిక తన సూసైడ్ నోట్‌లో రాసింది. అంకిత ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం కనిపించలేదు. ఆమె సింగపూర్‌లో స్థిరపడినట్లు సమాచారం.
గీతిక కుటుంబ సభ్యులు అంకితపై కూడా ఆరోపణలు చేశారని, తాము అంకితను కూడా ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications