ఎస్సెమ్మెస్‌ల కలకలం: టిడిపి నేత చిన్నప రెడ్డి అరెస్ట్

దీంతో జానా పరువుకు భంగం కలిగించేలా పలువురికి సంక్షిప్త సందేశాలు(ఎస్సెమ్మెస్‌లు) పంపారన్న అభియోగంపై అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నపరెడ్డి కొన్నేళ్లు అమెరికాలో ఉండి తిరిగి వచ్చారు. 2009 ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థిగా జానా రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి మంత్రి జానా రెడ్డికి, చిన్నప రెడ్డికి మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జానా రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ పేరుతో పదవులు సంపాదించుకున్నారని, ఆస్తులు పోగుచేసుకున్నారని, అక్రమాస్తులపై విచారణ జరిపించాలని తదితర ఎస్ఎంఎస్‌లు నియోజకవర్గ ప్రజలకు పంపినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీనిపై జూన్ చివరి వారంలో మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక దర్యాప్తు చేసిన సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో చిన్నప రెడ్డిని అరెస్టు చేశారు.
వైద్య పరీక్షల కోసం నిమ్స్‌కు వచ్చిన చిన్నపరెడ్డి.. ప్రజాసేవ చేద్దామని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని, ఈ చెత్త రాజకీయాల్లోకి లాగి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వాపోయారు. ఇలాంటి వాటికి భయపడబోనని జానా రెడ్డి అవినీతిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. జానారెడ్డి తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. జానాకు వ్యతిరేకంగా ఎస్సెమ్మెస్‌లు పంపాననేది వాస్తవం కాదన్నారు.












Click it and Unblock the Notifications