అంకితకు అమీర్ ఫనాలో చాన్స్: వాడుకున్న కందా?

Geetika Sharma-Gopal Kanda
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడైన గోపాల్ గోయల్ కందా బాలీవుడ్ వర్ధమాన నటి అంకితా సింగ్‌ను వాడుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత అంకితా సింగ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. అమీర్ ఖాన్, కాజోల్ నటించిన ఫనా సినిమాలో చిన్నపాటి పాత్ర ఇప్పించి కందా అంకితను వాడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గుర్గావ్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో నృత్య ప్రదర్శన సందర్భంగా అంకితతో కందాకు పరిచయం ఏర్పడిందని సమాచారం. ఆ తర్వాత కందాకు చెందిన గోవాలోని కాసినోలో ఉద్యోగంలో చేరింది. గీతికా శర్మ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఈ విషయాలన్ని బయటపడుతున్నాయి. గీతిక తన సూసైడ్ నోట్‌లో అంకిత పేరును కూడా ప్రస్తావించింది. కందాకు, అంకితకు ఓ పాప పుట్టారని కూడా చెప్పింది.

గీతిక ఆత్మహత్య సమాచారం తెలిసిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కందా అంకితకు సూచించినట్లు తెలుస్తోంది. గీతిక కుటుంబ సభ్యులు కూడా అంకిత గురించి పోలీసులకు వివరించారు. అంకిత తమకు ఫోన్ చేసి గీతికను ఎండిఎల్ఆర్‌లో చేర్పించాలని ఒత్తిడి చేసినట్లు వారు తెలిపారు.

మరో వర్దమాన నటి నూపుర్ మెహతా కూడా కందా, అంకిత సంబంధం గురించి మాట్లాడింది. దాంతో వివాదం ప్రారంభమైంది. గీతికకు, అంకితకు మధ్య గొడవ జరిగిందని, గీతిక అంకితపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని నూపుర్ మెహతా చెప్పింది.

అంకితకు, గీతికకు మధ్య సంబంధాలు బాగా లేవని, కందాతో ఇరువురికి కూడా సంబంధాలు ఉండడమే అందుకు కారణమని ప్రచారం సాగుతోంది. కందా తనను పెళ్లి చేసుకున్నాడని అంకిత చెప్పేదని అంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను కందా భార్య ఖండించారు. గీతికను తాము కూతురిలాగా చూసుకనేవాళ్లమని ఆమె చెప్పింది. అయితే, దర్యాప్తులో మాత్రం అందుకు భిన్నమైన విషయాలు బయటపడుతున్నాయి. గీతిక ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+