హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ హయాంలోనూ ప్రాబ్లమ్స్, బెదిరించి: శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Nagi Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా సమస్యలు వచ్చేవని, అయితే ఆనాడు ఆయన సమర్థవంతంగా వాటిని పరిష్కరించే వారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి మంగళవారం అన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా ఈ నెల 31వ తేదిన రాష్ట్రవ్యాప్త బందుకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ బందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పక్క రాష్ట్రాలలో మనకంటే తక్కువ మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారు కేంద్రాన్ని బెదిరించి పనులు చేయించుకుంటున్నారని, కానీ మన రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రం ఇంతమంది ఉండి కేంద్రం నుండి పనులు చేయించుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్ కొరత వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పిలుపుపై ప్రజలు ఆందోళన చేస్తుంటారని, అందుకు భిన్నంగా విద్యుత్ సమస్య పైన ప్రజలే తమంతట తాము స్పందించారన్నారు.

విద్యుత్ సబ్ స్టేషన్‌లను ముట్టడిస్తామని చెప్పారు. విద్యుత్ సంక్షోభం వస్తుందని ముందే తెలిసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ తెచ్చుకోవడంలో కూడా ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. శాసనసభ సమావేశాలు తక్షణం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్చించాలని శోభా నాగి రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
YSR Congress party Allagadda MLA Shobha Nagi Reddy said on Tuesday that late YS Rajasekhar Reddy also faced problems in his regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X