కందా ప్లే బాయ్: నూపుర్ మెహతా సంచలన వ్యాఖ్య

Gopal Kanda-Nupur Mehta
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడు హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాపై బాలీవుడ్ వర్ధమాన నటి తీవ్రమైన ఆరోపణలతో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కందాను ఆమె ప్లేబాయ్‌గా అభివర్ణించినట్లు, అందమైన అమ్మాయిల మధ్య ఉండడానికి ఇష్టపడేవాడని ఆమె చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కందాకు నూపుర్ మెహతా సన్నిహితురాలని అంటారు.

అమ్మాయిలను పడవేసి తీసుకురావడంలో అరుణా చద్దా కందాకు సహకరించేదని నూపుర్ మోహతా ఆరోపించారు. అరుణా చద్దా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. తన ఆత్మహత్యకు కందా, ఆయన సహాయకురాలు అరుణా చద్దా కారణమని గీతికా శర్మ తన సూసైడ్ నోట్‌లో రాసిన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఇదిలావుంటే, ఢిల్లీ కోర్టు గోపాల్ గోయల్ కందాను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపింది. గోపాల్ గోయల్ కందా ఈ నెల 18వ తేదీన పోలీసులకు లొంగిపోయారు. ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటారు.

కాగా, సిర్సాలోని కందా నివాసంలో సోమవారం పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు. గీతికతో ఆమెకు గల సంబంధాలపై తెలుసుకోవడానికి వారు ఈ సోదాలు నిర్వహించారు. గీతికా బాల్యస్నేహితుడిని ఒక్కతన్ని కందా తెర మీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. నావికా దళంలో పనిచేస్తున్న అతనికి గీతిక శర్మ ఆత్మహత్యతో ఏ విధమైన సంబంధం లేదని పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+