హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంచార్జి డిజిపిగా దినేష్ రెడ్డి: లిస్ట్ పంపిన ప్రభుత్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Dinesh Reddy
హైదరాబాద్: డిజిపి దినేశ్ రెడ్డి హోదాను ఇన్‌చార్జిగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త డిజిపి నియామకం కోసం సీనియారిటీ ప్రాతిపదికన 8 మంది ఐపిఎస్‌ల జాబితాను యూపిఎస్సీకి పంపించింది. కొత్త డిజిపిని నియమించేదాకా దినేశ్ రెడ్డినే ఆ పదవిలో కొనసాగించే వెసులుబాటు కూడా కోర్టు కల్పించింది.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు దినేశ్‌ను ఇన్‌చార్జి డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త డిజిపి నియామకంపై తొలుత ఐదు పేర్లతో జాబితాను పంపించింది. అయితే... డిజి హోదా కలిగిన అందరి పేర్లతో జాబితా పంపాలని కేంద్రం సూచించింది. దీంతో... సీనియారిటీ ప్రాతిపదికన వరుసగా గౌతమ్ కుమార్, ఉమేశ్ కుమార్, దినేశ్ రెడ్డి, అశోక్ ప్రసాద్, టిపి దాస్, అరుణ బహుగుణ, బి.ప్రసాద రావు, ఎస్‌కె హుదాలతో కూడిన జాబితాను కేంద్రానికి పంపించారు.

వీరిలో గౌతమ్ కుమార్ ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని.. ఈనెల 26 నుంచి అది అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక... డిజిపిపై ఫోర్జరీ ఫిర్యాదుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమేశ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్రం ఇటీవల తిరస్కరించడంతో ఆయన పేరును కూడా జాబితాలో చేర్చారు. వీరిద్దరి తర్వాతి పేరు... దినేశ్ రెడ్డిదే. కాగా, కొంతకాలంగా కేం ద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి, జమ్మూ కాశ్మీర్ డిజిపిగా ఉన్న అశోక్‌ ప్రసాద్ పేరునూ జాబితాలో పెట్టారు.

English summary
State government of Andhra Pradesh issued orders that Dinesh Reddy is incharge DGP of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X