• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైకోర్టుకెక్కిన నిమ్మగడ్డ: డీల్‌పై పట్టాభికి కోర్టు ప్రశ్న

By Pratap
|

Nimmagadda Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరుకు సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించడాన్ని ఆయన ఈ పిటిషన్‌లో సవాల్ చేశారు. ఇదే కేసులో సూత్రధారిగా భావిస్తున్న విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేశారని గుర్తుచేశారు. దర్యాప్తు దాదాపు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని కోరారు. సిబిఐ ఆరోపిస్తున్న విధంగా తాను అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించారు. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా పడింది.

సిబిఐ జెడి లక్ష్మినారాయణ కాల్‌లిస్టు కేసులో ప్రధాన నిందితుడు కె.రఘురామకృష్ణరాజుకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ ఎస్పీ డి. రామకృష్ణయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన రఘురామరాజు అరెస్టు నుంచి తప్పిం చుకునేందుకు కుటుంబంతో సహా సింగపూర్‌కు పారిపోయాడని సిఐడి పేర్కొంది. తొలి నుంచీ అరెస్టును తప్పించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని, దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌తో పాటు కింది కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆదేశాలను జత చేయాలని సీఐడీకి సూచిస్తూ పిటిషన్ విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిలు స్కాంలో అరెస్టయిన మాజీ జిల్లా జడ్జీలు డి.ప్రభాకరరావు, కె. లక్ష్మీనరసింహారావు ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గాలికి బెయిలు మంజూరు చేయడానికి సీబీఐ ప్రత్యేక జడ్జిని ప్రలోభాలకు గురిచేశారనే అభియోగాలపై ఈ ఏడాది జూలైలో వీరిని ఎసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం గురువారం రెండు వేర్వేరు జీవోలను జారీచేసింది.

గాలి బెయిల్ కేసులో దర్యాప్తు అధికారులు మోపిన అభియోగాలను అంగీకరిస్తున్నా రా? అని మాజీ జడ్జి పట్టాభి రామారావును ఏసీబీ 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి యస్.జగన్నాధం ప్రశ్నించారు. గాలి బెయిల్ డీల్‌లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి గడువు ముగియడంతో అధికారులు తదుపరి విచారణ నిమిత్తం వారిని కోర్టులో హాజరుపర్చగా వారిని జడ్జి అలా ప్రశ్నించారు.

తాము దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ బదులిచ్చారు. బెయిల్ పిటిషన్‌లో పట్టాభి కుమారుడు రవిచంద్ర, జూనియర్ న్యాయవాది ఆదిత్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి మిగతా వారి పిటిషన్లను తిరస్కరించి రిమాండ్ పొడిగించారు.

English summary
Nimmagadda Prasad alias Matrix Prasad, accused in YSR Congress president YS Jagan, applied for bail in High Court. He challenged CBI special court decision on his bail application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X